2025 ఐపీఎల్ వేలం తేదీ ఖరారు..! 1 m ago
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఖరారయ్యాయి. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎల్ వేలంలో మొత్తం 1,574 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇందులో 1,165 భారత క్రికెటర్లు ఉన్నారని బీసీసీఐ తెలిపింది. ఇందులో 320 మంది క్యాప్‌డ్డ్ ప్లేయర్లు, 1,224 అన్‌క్యాప్డ్‌డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మందితో జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటికే ఎంపిక చేసుకున్న రిటైన్ ప్లేయర్లతో కలిపి మొత్తంగా వేలంలో 204 స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడనున్నారు. ఇదిలా ఉంటే భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి బోర్డర్ గవాస్కర్ టెస్టు జరుగుతున్న సమయంలోనే ఈ వేలం జరుగనుంది.